1, అక్టోబర్ 2011, శనివారం

మృగతృష్ణ

ప్రకృతి నేర్పే చిత్రమైన పాఠం ఎండమావులు
ఉన్నట్టే భ్రమను కల్పిస్తూ ఏమీ లేదని చెప్పే వింత అనుభవం.
మండుటెండలో ప్రయాణిస్తూ కనుచూపుమేరలో నీటి తడిని చూస్తూ
ఇక్కడెప్పుడు వర్షం కురిసింది చెప్మా అనుకుంటూనే దగ్గరకి వెడితే
                                ఏమి లేదని వెక్కిరించింది.
ఎన్నెన్నో అందాలూ, ఆశలూ,ఊరిస్తూ దూరంగా కనిపించి
తీరా దగ్గరకెళ్ళాక పసివాడు "ఏమిలేదు" అని ఉత్తచేతులు చూపినట్టు
లేని దాని కోసం భ్రాంతులూ,భయాలూ ఈర్ష్యా ద్వేషాలు,
మోసాలు,వేషాలు,నటనలూ ఇన్ని అవసరం లేదంటూ
దేముడు ఎందమావుల్ని చూపిస్తున్నా మన పరుగును ఆపం కదా!

26, సెప్టెంబర్ 2011, సోమవారం

మధురిమ



 నీ స్నేహంలోని  మధురిమను ఎలా వర్ణించను నేస్తం?
తేనె జలపాతాలతో, వెండి మబ్బుల గుంపుతో,
శరత్ జ్యోత్స్నలతో, పూల దామాలతో , మోహన రాగంతో,
దేనితోను సరిపోని తుషార పరంపర నీ  చెలిమి !